అరుంధతికి 15 ఏళ్లు
అనుష్క శెట్టి ఆనందం
తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకతను కలిగి ఉంది నటి అనుష్క శెట్టి. తాను ప్రభాస్ తో నటించిన బాహు బలి చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. కోట్లు కొల్లగొట్టింది. ఇదిలా ఉండగా తను నటించిన అరుంధతి చిత్రం ఆ మధ్యన సక్సెస్ అయ్యింది.
మరో వైపు ఈ మూవీ పూర్తయి ఈ ఏడాదతో 15 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తన ఆనందాన్ని పంచుకుంది నటి అనుష్క శెట్టి. ప్రేక్షకుల హృదయాల్లో తనకు ఎప్పటికీ ప్రత్యేక స్థానం కల్పించింది ఈ మూవీ. ఇందులో తన క్యారెక్టర్ పేరు జేజమ్మ. ఇదే తనను ఇప్పటికీ ఎల్లప్పటికీ గుర్తు పెట్టుకునేలా చేసిందని తెలిపింది.
ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకుంది అనుష్క శెట్టి. ప్రేక్షకులను తాను మరిచి పోలేనని పేర్కొంది. ఎలప్పటికీ ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. భారతీయ సినిమా చరిత్రలో ఇతిహాసం నేపథ్యంగా తీసినందుకు తాను దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ గారికి రుణపడి ఉన్నానని తెలిపారు జేజమ్మ.
ఇంతటి అద్భుతమైన చిత్రాన్ని తీసిన నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.