సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి హరీశ్
హైదరాబాద్ : దార్శకనిత కలిగిన నాయకుడిగా పేరు పొందిన మాజీ సీఎం కేసీఆర్ హయాంలో ప్రతిష్టాత్ కంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని యావత్ దేశం మెచ్చుకుందని అన్నారు. ఈ పథకాన్ని మక్కీకి మక్కీ కేంద్రం లోని బీజేపీ సర్కార్ కాపీ కొట్టిందని ఆరోపించారు. పూర్తిగా దీనిని పేరు మార్చి హిందీలో హర్ ఘర్ జల్ అని ప్రారంభించిందంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ మోడల్‌ను చూసి కేంద్ర ప్రభుత్వం అనుసరించే విధంగా కేసీఆర్ తెలంగాణను తీర్చిదిద్దారని అన్నారు. దేశానికే ఆయన పాలన ఓ రోల్ మోడల్ గా మారిందన్నారు. మిషన్ భగీరథ పథకం వల్ల ప్రతీ ఇంటికి తాగు నీరు అందించి, ఏ రాష్ట్రంలో లేని విధంగా తాగునీటి సరఫరా అందించామని, ఈ ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు హరీశ్ రావు.
కాగా కేంద్రం హర్ ఘర్ జల్ పేరిట కార్యక్రమం ప్రారంభించి 8 ఏళ్లు గడిచినా ఇంకా అన్ని రాష్ట్రాల్లో మంచి నీరు ఇవ్వలేక పోయిందంటూ ఫైర్ అయ్యారు. ఇక రాష్ట్ర పాలన గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. రాష్ట్రంలో పాలన కుంటు పడిందని, గాడి తప్పి పోయిన దీనిని పట్టాలు ఎక్కించే తెగువ, సామర్థ్యం ఈ సీఎంకు లేనే లేదన్నారు హరీశ్ రావు. ఆయన ఎంత సేపు తమ నాయకుడిని, తమను ఆడి పోసు కోవడమే తప్పా తనకు పాలన గురించి సరైన అవగాహన లేదన్నారు. ఇకనైనా సీఎం తన నోటి దురుసు తగ్గించు కోవాలని హితవు పలికారు. లేకపోతే ప్రజల నుంచి ఛీత్కారం ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.






