మూసీ నది పునరుద్దరణపై చర్చ
లండన్ అధికారులతో సీఎం భేటీ
లండన్ – సీఎం రేవంత్ రెడ్డి లండన్ లో బిజీగా ఉన్నారు. ఆయన మూడు రోజుల పాటు ఇక్కడ పర్యటించనున్నారు. శుక్రవారం లండన్ కు చెందిన ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. మూసీ నది పునరుద్దరణకు సంబంధించిన ప్రతిష్టాత్మక ప్రణాళికలపై పోర్ట్ ఆఫ్ లండన్ అధికారులతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి.
థేమ్స్ నది అపెక్స్ గవర్నింగ్ బాడీకి చెందిన ఆఫీసర్లతో చర్చించారు. ఒకసారి మూసీని పునరుజ్జీవింప చేసి పూర్తి స్థాయికి తీసుకు రావాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు . హైదరాబాద్ నది, సరస్సుల ద్వారా మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు సీఎం.
ఈ సందర్భంగా మూసీ నది ప్రాజెక్టుకు సమగ్ర మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో థేమ్స్ నది నిర్వహణ గురించి తెలుసు కోవడం, దాని నిర్వహణ నుండి అవగాహన పొందడం ముఖ్యమన్నారు. ఉత్తమ పద్దతులను క్రోడీకరించడం కోసం తాను లండన్ ను సందర్శించేందుకు ప్రధాన కారణమని స్పష్టం చేశారు ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి.