హైడ్రా కాపాడిన పార్కులో వనభోజనాలు

సత్యనారాయణ వ్రతం నిర్వహించి సంబరాలు

హైద‌రాబాద్ : హైడ్రాకు రోజు రోజుకు న‌గ‌ర వాసుల నుంచి మ‌ద్ద‌తు పెరుగుతోంది. నిజాంపేట మున్సిపాలిటీ కోశల్యానగర్లోని హైడ్రా కాపాడిన బనియన్ ట్రీ పార్కులో స్థానికులు వన భోజనాలు చేశారు. కార్తీకమాసం కావడంతో సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. నిజాంపేట మున్సిపాలిటీలో ఇటీవల రెండు పార్కులను హైడ్రా కాపాడింది. బృందావ‌న్ కాల‌నీలో 2300 గ‌జాల పార్కును కాపాడ‌గా, కౌశ‌ల్యానగర్ కాల‌నీలోని 300ల గజాల విస్తీర్ణంలో ఉన్న బ‌నియ‌న్ ట్రీ పార్కును క‌బ్జాల నుంచి ర‌క్షించింది. కౌశల్యానగర్ కాలనీలోని 300 గజాల పార్కుకు చుట్టూ ఆక్రమణదారులు ప్రహరీ నిర్మించి కాజేశారు. ఎవరూ పార్కులోకి రాకుండా అడ్డుకున్నారు.

అలా ఆక్రమణలో వున్న పార్కును కాపాడి కోశల్యానగర్ కాలనీ వాసులకు హైడ్రా అప్పగించింది. అందుకే కాలనీవాసులు బనియన్ ట్రీ పార్కుకు చేరుకుని కార్తీక వనభోజనాలు చేశారు. అదే పార్కులో కాలనీ వాసులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వ‌హించ‌డం విశేషం. దాదాపు వెయ్యి మంది కలసి ఈ ఉత్సవాలను జరుపుకున్నారు. పిల్లలు పెద్దలు హైడ్రా జిందాబాద్..అంటూ హైడ్రా కి హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలియ చేసారు. ప్లకార్డులు ప్రదర్శించి హైడ్రాకు మద్దతు పలికారు. అలాగే బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీలో ఫార్చ్యూన్ మెడోస్ కాలనీలో అడ్డుగోడలు తొలగించి వెనువెంటనే సిమెంట్ రోడ్డు వేసిన హైడ్రాకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. హైడ్రా వచ్చింది దారులు తెరిచిందంటూ కీర్తించారు.

  • Related Posts

    ప్రాథమిక వ్యవసాయ రంగంలో ఏపీ నెంబ‌ర్ వ‌న్

    ప్ర‌క‌టించిన మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్రాథ‌మిక వ్య‌వ‌సాయ రంగంలో ఏపీ టాప్ లో ఉంద‌న్నారు. ఈ 17 నెలల కాలంలో సూపర్ సిక్స్ పథకాలను పూర్తిగా నెరవేరుస్తూ…

    రైతుల‌ను బ‌లోపేతం చేయ‌డంలో నాబార్డ్ కృషి

    స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క హైద‌రాబాద్ : ఈ దేశానికి వెన్నెముక‌గా రైతులు ఉన్నార‌ని అన్నారు రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. రైతుల‌కు అన్ని విధాలుగా అండ‌గా ఉంటూ వారిని మ‌రింత అభివృద్ది చేసేందుకు ప్ర‌య‌త్నం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *