నైపుణ్యాభివృద్ది కేంద్రాల‌ను ఏర్పాటు చేయాలి

Spread the love

పార్ల‌మెంట్ లో ప్ర‌స్తావించిన ఎంపీ హ‌రీష్ బాల‌యోగి

ఢిల్లీ : పార్ల‌మెంట్ సాక్షిగా ప‌లు స‌మ‌స్య‌ల‌ను ఏక‌రువు పెట్టారు ఎంపీ హ‌రీష్ బాల‌యోగి. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని యువతకు నైపుణ్యాలను మెరుగు పరుచుకునేందుకు, వేగంగా మారుతున్న నేటి ఉద్యోగ మార్కెట్‌కు తమను తాము సిద్ధం చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్న , కష్టపడే యువత మన జిల్లాలో చాలా మంది ఉన్నార‌ని చెప్పారు. కానీ ఈ ప్రాంతంలో శిక్షణా కేంద్రాలు లేకపోవడం వల్ల, వారి జీవితాలను మార్చే అవకాశాలను చాలా మంది కోల్పోతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఎంపీ హ‌రీష్ బాల‌యోగి.

ప్రతి యువతీ యువకుడికి నాణ్యమైన శిక్షణ అందుబాటులో ఉండేలా, డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు నైపుణ్య శిక్షణా సౌకర్యాలను ప్రాధాన్యత ఇవ్వాలని ఈరోజు లోకసభలో 377 ద్వారా విజ్ఞప్తి చేశారు. సరైన శిక్షణ, తోడ్పాటుతో, మన యువత ఉద్యోగ అవకాశాలకు, భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు ఆస్కారం ఏర్ప‌డుతుంద‌న్నారు. అంతే కాకుండా నైపుణ్యాలను పెంపొందించడానికి తగిన చర్యలు తీసుకుంటే జిల్లా యువత భారతదేశ అభివృద్ధికి తోడ్పాటును అందించే దిశగా అడుగులు వేస్తారని స్ప‌ష్టం చేశారు. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.

  • Related Posts

    జగన్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి

    Spread the love

    Spread the loveటీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యవిజ‌య‌వాడ : పరకామణి చిన్నకేసు అని అవహేళన చేసిన మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై సీరియ‌స్ కామెంట్స్ చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య . త‌క్ష‌ణ‌మే…

    సింగ‌రేణి సీఎండీగా కృష్ణ భాస్క‌ర్

    Spread the love

    Spread the loveమాతృ విభాగానికి ఎన్. బ‌ల‌రామ్ క‌రీంన‌గ‌ర్ జిల్లా : దేశంలోనే అత్యంత పేరు పొందిన సంస్థ సింగ‌రేణి గ‌నుల సంస్థ‌. ఈ సంస్థ‌కు సీఎండీగా విశిష్ట సేవ‌లు అందించారు ఎన్. బ‌ల‌రామ్. త‌ను ఏడేళ్ల పాటు డిప్యూటేష‌న్ పై…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *