దుద్దిళ్ల సీఎం అవుతాడని అనుకున్నా
ఎమ్మెల్సీ భాను ప్రసాద్ కామెంట్స్
కరీంనగర్ జిల్లా – బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ భాను ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ లో కీలక ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే తాను దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి అవుతాడని అనుకున్నానని, కానీ ఊహించని విధంగా ఎనుముల రేవంత్ రెడ్డి కావడం తనను విస్తు పోయేలా చేసిందన్నారు. అపారమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు గుర్తింపు ఉందన్నారు ఎమ్మెల్సీ.
అయితే ఇవాళ అవకాశం రాక పోయినా ఏదో ఒక రోజు శ్రీధర్ బాబు సీఎం కావడం ఖాయమని జోష్యం చెప్పారు. కాంగ్రెస్ హై కమాండ్ ఎందుకని ఆయనకు అవకాశం ఇవ్వలేదో తనకు అర్థం కావడం లేదన్నారు. మొత్తంగా రాజకీయ టీ కప్పులో ఎమ్మెల్సీ భాను ప్రసాద్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
ఇప్పటి వరకు బీఆర్ఎస్ లో ఉన్న భాను ప్రసాద్ స్వరం మారడం విస్తు పోయేలా చేసింది.