పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు
పాకిస్తాన్ : పాకిస్తాన్ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఇప్పటికే జైలుపాలై శిక్షను అనుభవిస్తున్న మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఆయన భార్యకు 17 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. తను అధికారంలో ఉన్నప్పుడు సౌదీ అరేబియా ప్రభుత్వం నుండి వచ్చిన ఆభరణాలతో సహా బహుమతులను వాటి మార్కెట్ విలువ కంటే చాలా తక్కువ ధరకు విక్రయించారని వారిపై ఆరోపణలు వచ్చాయి. పాకిస్తాన్ చట్టం ప్రకారం, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు విదేశీ ప్రముఖుల నుండి అందుకున్న బహుమతులను తమ వద్ద ఉంచుకోవాలంటే, వాటిని అంచనా వేసిన మార్కెట్ ధరకు కొనుగోలు చేసి, వాటిని అమ్మడం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది.
జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అతని భార్యను ప్రభుత్వ బహుమతులను అక్రమంగా ఉంచుకుని, విక్రయించినందుకు దోషులుగా నిర్ధారించింది పాకిస్తాన్ కోర్టు . శనివారం వారికి 17 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇది కోలుకోలేని షాక్ అని చెప్పక తప్పదు. ఇదిలా ఉండగా గత సంవత్సరం వారిపై అభియోగాలు మోపినప్పుడు ఆ దంపతులు తాము నిర్దోషులమని వాదించారు. ఇమ్రాన్ ఖాన్ , అతని భార్య అధికారికంగా ప్రకటించని బహుమతులను తిరిగి అమ్మడం ద్వారా డబ్బు సంపాదించారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కోర్టుకు సమర్పించడంతో బిగ్ షాక్ ఇస్తూ శిక్ష విధించారు న్యాయమూర్తి.





