ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ద్వారా విశిష్ట సేవ‌లు

స్ప‌ష్టం చేసిన నారా భువ‌నేశ్వ‌రి

అల్లూరి సీతారామ రాజు జిల్లా : ఎన్టీఆర్ ట్ర‌స్టు బాధ్యులు నారా భువ‌నేశ్వ‌రి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇరు తెలుగు రాష్ట్రాల‌లో గ‌త 29 ఏళ్లుగా విశిష్ట సేవ‌లు అందిస్తున్న‌ట్లు చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో కూడా సేవలు అందించాలని 2,083 మొబైల్ క్యాంపుల ద్వారా వైద్య సేవలు అందించామ‌ని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అనాధ పిల్లలను చదివిస్తున్నట్లు పేర్కొన్నారు. 2,113 మంది అనాథలకు విద్యను అందించడమే కాకుండా వారికి అవసరమైన అవసరాలు తీర్చుతూ యూనిఫాం అందించిన‌ట్లు పేర్కొన్నారు. పేద పిల్లల‌కు రూ.3.50 కోట్లు స్కాలర్షిప్పులను అందించనిట్లు వెల్ల‌డించారు. మరో 4,297 మంది కాలేజీ విద్యార్థులకు రూ.2.70 కోట్లు ఇచ్చిన‌ట్లు తెలిపారు.

వైజాగ్, హైదరాబాద్, తిరుపతి, రాజమండ్రిలో 4 బ్లడ్ బ్యాంకులు ద్వారా 5 లక్షల యూనిట్లు సేకరించి 9.18 లక్షల మందికి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందించామ‌ని చెప్పారు. ఇదంతా ప్రజలు, దాతల సహకారంతోనే సాధ్యమైందన్నారు. ట్రస్ట్ తరపున ఏ కార్యక్రమం చేపట్టినా దాతలు ముందుకు వ‌స్తున్నార‌ని చెప్పారు నారా భువ‌నేశ్వ‌రి. పేదల కోసం ట్రస్ట్ ఖర్చు చేస్తున్న నిధులకు దాతలు సహకారం అందిస్తుండ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. దాతలు మాపై ఉంచిన నమ్మకమే మా బలం అని పేర్కొన్నారు. యూత్ సెంటర్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీఎస్ఎల్ అండ్ జీఎస్ఆర్ హాస్పటల్స్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *