మూడవ స్థానంతో సరిపెట్టుకున్న ఇమ్మాన్యూయెల్
హైదరాబాద్ : నిన్నటి దాకా అలరిస్తూ , వినోదాన్ని పంచుతూ వచ్చిన బిగ్ బాస్ -9 రియాల్టీ షో కథ ముగిసింది. అంతిమ విజేత ఎవరో అనే ఉత్కంఠకు తెర దించారు హోస్ట్ నాగార్జున, నిర్వాహకులు. హైదరాబాద్ వేదికగా భారీ ఏర్పాట్లు చేశారు. అందరూ ఊహించని విధంగా కాకుండా కన్నడ నటిమణి తనూజ పుట్టస్వామిని పక్కన పెట్టేసి విజేతగా నిలిచాడు కళ్యాణ్ పడాల. తను ఆర్మీకి చెందిన జవాన్. కేవలం ఇందులో పార్టిసిపేట్ చేయాలన్న కసితో వచ్చాడు. అన్ని టాస్కులను ఎదుర్కొన్నాడు. చివరకు విన్నర్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు.
బిగ్ బాస్ పోటీ కోసం చివరకు ఐదుగురు కంటెస్టెంట్స్ నిలిచారు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఫైనల్ ఓటింగ్ లో ముగ్గురు నిలిచారు. వారిలో తనూజ పుట్టస్వామి, కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యూయెల్. తొలుత తనూజ టాప్ లో కొనసాగింది. అందరూ ఆమెనే విన్నర్ అవుతుందని ఆశించారు. కానీ రెండు రోజుల తర్వాత సీన్ మారింది. ఊహంచని షాక్ ఇస్తూ తనూజ ఓటింగ్ లో వెనక్కి వెళ్లింది. కళ్యాణ్ పడాల ముందు వరుసలోకి వచ్చేశాడు. ఇక ఒకానొక దశలో ఇమ్మాన్యూయెల్ రన్నరప్ వరకు వచ్చాడు. కానీ ఆఖరుకు విన్నర్ గా పడాల, రన్నరప్ గా తనూజ, మూడో ప్లేస్ లో ఇమ్మాన్యూయెల్ నిలిచాడు. విన్నర్ గా నిలిచిన కళ్యాణ్ కు భారీ ప్రైజ్ మనీతో పాటు కొత్తగా మారుతి కారు కూడా లభించింది.








