మ్యూజిక్ చార్ట్ లో టాప్ లో కొనసాగుతోంది
ముంబై : ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ధురంధర్ మూవీ దుమ్ము రేపుతోంది. ఇప్పటికే కోట్ల వర్షం కురిపిస్తోంది. వరల్డ్ వైడ్ గా భారతీయులనే కాదు దాయాది పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, బెలూచిస్తాన్ తో పాటు అరబ్ కంట్రీస్ ను షేక్ చేస్తోంది. ఇక మ్యూజిక్ చార్ట్ లలో నెంబర్ వన్ లో కొనసాగుతోంది శరారత్ సాంగ్. దీనికి అద్భుతంగా కొరియోగ్రఫీ చేశాడు విజయ్ గంగూలీ. ధురంధర్ మూవీ పూర్తిగా జరిగిన ఘటన ఆధారంగా తెరకెక్కించాడు దర్శకుడు. ఇది ఇండియన్ గూఢచారి కథ. ప్రత్యేకించి రణ్ వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా నటనకు జనం నీరాజనం పలుకుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పిచ్చెక్కి పోతున్నారు. ఇందులో నటించిన నటీనటుల నటన పీక్ స్టేజ్ లో ఉందంటూ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.
ఇక శరారత్ సాంగ్ తో పాటు ఇతర పాటలు కూడా సినిమాకు హైలెట్ గా నిలిచాయి. మ్యూజిక్ చార్ట్స్ ను షేక్ చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రధానంగా ఈ పాట హిట్ కావడంతో స్పందించాడు కొరియాగ్రాఫర్ విజయ్ గంగూలీ. కీలక వ్యాఖ్యలు చేశాడు. ముందుగా తమన్నా భాటియాను తీసుకుందామని అనుకున్నామని, కానీ దర్శకుడు ఆదిత్య ధర్ ఒప్పుకోలేదన్నాడు. కథకు ఒకే నటి ఉండడం సరిపోదని పేర్కొన్నాడు. ఇక శరారత్ సాంగ్ లో కెవ్వు కేక అనిపించేలా నటించారు అయేషా ఖాన్, క్రిస్టల్. ఇద్దరూ పోటీ పడి నటించారు. ఇక ధురంధర్ మూవీని జ్యోతి దేశ్ పాండే, లోకేష్ ధర్ నిర్మించారు. ఈ మూవీలో ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కూడా కీలక పాత్రలు పోషించారు. శశ్వావత్ సచ్ దేవ్ మ్యూజిక్ అందించగా మధుబంతి బాగ్చి, జాస్మిన్ శాండ్లాస్ పాడారు.








