DEVOTIONAL

10 నుంచి బ్ర‌హ్మోత్స‌వాలు

Share it with your family & friends

వెల్ల‌డించిన టీటీడీ ఈవో

తిరుమ‌ల – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ ) ఆధ్వ‌ర్యంలో ఈనెల 10 నుంచి 18 వ‌ర‌కు క‌డ‌ప శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగుతాయ‌ని టీటీడీ వెల్ల‌డించింది. ఈ మేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది.

16న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు, తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారు, నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారు సప్త వాహనాలపై విహరించి భక్తులను కటాక్షించనున్నారని తెలిపింది టీటీడీ.

–17 నుండి 23వ తేదీ వరకు శ్రీ గోవిందరాజ స్వామివారి తెప్పోత్సవాలు జ‌రుగుతాయ‌ని వెల్ల‌డించింది. అంతే కాకుండా శ్రీనివాస మంగాపురం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 8వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తామ‌ని తెలిపింది.

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 1 నుంచి 10వ తేదీ వరకు జ‌రుగుతాయ‌ని టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డి వెల్ల‌డించారు.