స్పష్టం చేసిన నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్
హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. ఈ కేసుకు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చారు. ఇందుకు గాను అధికారికంగా తన పేరులో ప్రకటన విడుదల చేశారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని అన్నారు. ఎలా పడితే అలా కామెంట్స్ చేస్తున్న రాజకీయ నాయకులను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా సజ్జనార్ చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్ లో చర్చకు దారితీశాయి. తనపై నోరు పారేసుకున్న మాజీ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి కూడా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇదిలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ కేసు 2024 మార్చి 10న నమోదైందని స్పష్టం చేశారు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్. ఇప్పటికే కొంతమంది నిందితులపై ప్రధాన ఛార్జిషీటు కూడా దాఖలు చేయడం జరిగిందన్నారు. కేసుకు సంబంధించిన ఇతర అంశాలపై ఇంకా లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు సజ్జనార్.
సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావును విచారిస్తున్నారంటూ జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని ఆయన కోరారు. అటువంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నామని వార్నింగ్ ఇచ్చారు సజ్జనార్.





