కీలక అంశాలపై విస్తృతంగా చర్చలు
దావోస్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపు గురువు చంద్రబాబు నాయుడు ఇంకో వైపు శిష్యుడు రేవంత్ రెడ్డి ఇద్దరూ దావోస్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. వివిధ కంపెనీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ లో భాగం పంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా దిగ్గజ కంపెనీ టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్ తో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కీలక అంశాలు చర్చించారు. విజన్–2047 లక్ష్యాలు పెట్టుబడులకు ఉన్న అనుకూల విధానాలను వివరించారు టాటా గ్రూప్ చైర్మన్ కు సీఎం రేవంత్ రెడ్డి.
హైదరాబాద్ లో స్టేడియాల అభివృద్ధికి టాటా సహకారం అందించాలని కోరారు. ఈ సందర్బంగా సీఎం చేసిన విన్నతికి సానుకూలంగా స్పందించారు టాటా చైర్మన్ చంద్రశేఖరన్. అంతే కాకుండా సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే మూసీ నది పునరుజ్జీవనంలో భాగస్వామ్యం అయ్యేందుకు కూడా టాటా ఆసక్తి చూపించడం విశేషం. అంతే కాకుండా తెలంగాణలో హొటళ్లు, రిసార్ట్స్ ఏర్పాటు కోసం కూడా సపోర్ట్ చేస్తామని ప్రకటించింది. ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్త మానుఫాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు చర్చలు జరపడం జరిగిందని స్పష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి.






