24న న‌గ‌రిలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న

Spread the love

భారీ ఎత్తున ఏర్పాట్లు చేశామ‌న్న క‌లెక్ట‌ర్
చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు చిత్తూరు జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఇందులో భాగంగా ఆయ‌న ఈనెల 24వ తేదీన జిల్లాలోని న‌గ‌రి ప‌ట్ట‌ణంలో నిర్వ‌హించే స్వ‌చ్ఛ ఆంధ్ర స్వ‌చ్ఛ మిష‌న్ లో పాల్గొంటారు. అనంత‌రం ఏర్పాటు చేసే బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తారు. ఇదిలా ఉండ‌గా సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు క‌లెక్ట‌ర్ సుమిత్ కుమార్ , ఎస్పీ తుషార్ డూడి.

ఈ సంద‌ర్బంగా ఎస్పీ మాట్లాడారు. స‌భా ప్రాంగణంలో భద్రతా చర్యలు కట్టుదిట్టంగా చేపట్టాలని, బ్యారికేడింగ్, మెటల్ డిటెక్టర్ చెకింగ్, ఫ్రిస్కింగ్, సీసీ కెమెరాల పర్యవేక్షణ, డ్యూటీ పాయింట్ల వద్ద సిబ్బంది అప్రమత్తత వంటి అంశాలను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. వీఐపీ రూట్, సభా ప్రాంగణ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు/వాహనాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం , పబ్లిక్ మీటింగ్ నిర్వహణకు సంబంధించిన అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండాలని అన్నారు. పారిశుధ్యం, త్రాగునీరు, విద్యుత్ సరఫరా, వైద్య శిబిరం, ఫైర్ సేఫ్టీ, తాత్కాలిక మరుగుదొడ్లు, ప్రజలకు సూచనల కోసం సైన్‌బోర్డులు వంటి ఏర్పాట్లు సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటన సందర్భంలో ప్రజలకు భద్రతతో పాటు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించడానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ముందస్తుగా సమీక్షించి, బందోబస్తు, ట్రాఫిక్, భద్రతా నిఘా తదితర వ్యవస్థలను మరింత పటిష్టంగా అమలు చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, పోలీస్ అధికారుల బృందం పాల్గొన్నారు.

  • Related Posts

    రాయలసీమ ద్రోహి జగన్ మోహ‌న్ రెడ్డి

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన మంత్రి ఎస్. స‌విత అమరావ‌తి : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. ఆమె మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి ప్రధాన…

    ప‌ర్యావ‌ర‌ణ హితంగా చెరువుల పున‌రుద్ద‌ర‌ణ

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టికే న‌గ‌రంలో ప‌లు చెరువుల‌ను పున‌రుద్ద‌ర‌ణ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. పెద్ద ఎత్తున మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పించామ‌న్నారు. తాజాగా స‌రూర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *