మాజీ ప్ర‌ధాని దేవెగౌడ ఆశీర్వాదం తీసుకున్న డీకేఎస్

Spread the love

రాజ‌కీయ ప‌రంగా ఆయ‌న అప‌ర చాణ‌క్యుడ‌ని కితాబు

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క నూత‌న ముఖ్య‌మంత్రిగా క‌ర్ణాట‌క ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు డీకే శివ‌కుమార్ బుధ‌వారం అనుకున్న స‌మ‌యానికి ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ పార్టీతో పాటు జేడీఎస్ , బీజేపీ, త‌దిత‌ర పార్టీల‌కు చెందిన అతిర‌థ నాయ‌కులంతా హాజ‌ర‌య్యారు. కాంగ్రెస్ పార్టీలో ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరు పొందారు డీకే శివ‌కుమార్. ఇవాళ ప్ర‌మాణ స్వీకారోత్స‌వం సంద‌ర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండ‌గా ఎవ‌రూ ఊహించ‌ని విధంగా డీకే శివ‌కుమార్ సంచ‌ల‌నంగా మారారు. కొలువు తీర‌క ముందే ఆయ‌న ప్ర‌ధాన పార్టీల‌ను శాసిస్తున్న కీల‌క నేత‌ల‌తో భేటీ అయ్యారు. ఇది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ముందుగా నేరుగా డీకే శివ‌కుమార్ మాజీ భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి దేవేగౌడ నివాసానికి వెళ్లారు. ఆయ‌న కాళ్ల‌కు న‌మ‌స్క‌రించారు. ఆయ‌న నుంచి ఆశీర్వాదం పొందారు. త‌న‌ను శాలువాతో స‌త్క‌రించారు మాజీ ప్ర‌ధాన‌మంత్రి. అనంత‌రం ఇద్ద‌రూ చాలా సేపు వివిధ అంశాల‌పై చ‌ర్చించారు. లోక్ భ‌వ‌న్ లో జ‌రిగే ప్ర‌మాన స్వీకార కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాల్సిందిగా దేవెగౌడ‌ను ఆహ్వానించారు. అక్క‌డి నుంచి నేరుగా మాజీ సీఎం యెడ్యూర‌ప్ప ఇంటికి వెళ్లారు. ఆయ‌న‌తో బేటీ కావ‌డం ప్రాదాన్య‌త సంత‌రించుకుంది.

  • Related Posts

    పాల‌నా ప‌రంగా య‌డ్యూర‌ప్ప అనుభ‌వం అవ‌స‌రం

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన నూత‌న సీఎం డీకేఎస్ బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. బుధ‌వారం నూత‌న ముఖ్య‌మంత్రిగా కొలువు తీరారు క‌ర్నాట‌క ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ ప్రెసిడెంట్, మాజీ డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్. ఆయ‌న…

    ఏఎస్పీ భుజంగ‌రావు ఇళ్ల‌లో ఏసీబీ సోదాలు

    Spread the love

    Spread the loveఫోన్ ట్యాపింగ్ కేసులో కీల‌క నిందితుడు హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపింది. ఇప్ప‌టికే ప‌లువురు ఉన్న‌తాధికారుల‌కు ప్ర‌మేయం ఉందంటూ పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో కొత్త‌గా కొలువు తీరిన కాంగ్రెస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *