20 వేల మందికి పైగా ఉపాధి కల్పన

జేఎస్ఎస్ మ‌హా విద్యా పీఠ్ ప్ర‌క‌ట‌న

తిరుప‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క ఒప్పందం చేసుకుంది క‌ర్ణాట‌క‌కు చెందిన ప్ర‌ముఖ విద్యా సంస్థ జేఎస్ఎస్ మ‌హా విద్యాపీఠ్. ఈ ఒప్పందం ప్రకారం తిరుపతిలో భూమి కేటాయింపు, అవసరమైన చట్టబద్ధ అనుమతుల కోసం సింగిల్-విండో వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది. క్యాంపస్ అభివృద్ధికి సంబంధించిన మొత్తం వ్యయాన్ని జేఎస్‌ఎస్ మహా విద్యా పీఠమే భరించడంతో పాటు యూజీసీ నుంచి అవసరమైన అనుమతులను పొందనుంది. అమలు ప్రక్రియను పర్యవేక్షించేందుకు 60 రోజులలోపు జాయింట్ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు.

స్వర్ణాంధ్ర విజన్ కు అనుగుణంగా ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేలకు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంలోని ప్రతిభావంతులైన విద్యార్థులు, పరిశోధకులు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఈ సంస్థ తోడ్పాటును అందించనుంది. ఈ కార్యక్రమంలో మైసూరు జేఎస్ఎస్ ఏహెచ్ఈఆర్ రిజిస్ట్రార్ డా.బి.మంజునాథ, జేఎస్ఎస్ ఏహెచ్ఈఆర్ డీన్(రీసెర్చ్) డా. ప్రశాంత్ ఎమ్ విశ్వనాథ్, కేపీఎంపీ అడ్వైజరీ సర్వీసెస్ అసోసియేట్ డైరెక్టర్ ఎస్.రాఘవన్, స్పెషలిస్ట్ రోమిత్ రావు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    అగ్నిమాప‌క సిబ్బంది ప‌నితీరు భేష్ : అనిత వంగ‌ల‌పూడి

    అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం, విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ‌ల మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో అగ్ని మాప‌క శాఖ‌లో ప‌ని చేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల ప‌నితీరు అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంసలు కురిపించారు. సోమ‌వారం విజయనగరం జిల్లాలో…

    జ‌గ‌న్ రెడ్డి ఆరోప‌ణ‌లు అవాస్త‌వం : డోలా శ్రీ బాల

    అమ‌రావ‌తి : మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. ఆయ‌న చేస్తున్న ఆరోప‌ణ‌లలో వాస్త‌వం లేద‌న్నారు. సోమ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండా, నిర్దిష్ట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *