అంగన్వాడీల సమ్మె సక్సెస్
దిగొచ్చిన జగన్ రెడ్డి సర్కార్
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ ఎట్టకేలకు దిగి వచ్చింది. ఎస్మా ప్రయోగించినా డోంట్ కేర్ అంటూ రంగంలోకి దిగారు అంగన్వాడీలు. తమకు న్యాయ పరమైన రావాల్సిన జీతాలు చెల్లించాలని కోరుతూ గత కొన్ని రోజులుగా మెరుపు సమ్మె చేపట్టారు. పోలీసుల చేతుల్లో చావు దెబ్బలు తిన్నారు. తీసి వేస్తామని హెచ్చరించినా పట్టించు కోలేదు అంగన్వాడీలు. ముందుకే సాగారు. తమ డిమాండ్లను ఒప్పుకునేంత దాకా ఆందోళన విరమించే ప్రసక్తి లేదంటూ తేల్చి చెప్పారు.
మంత్రి బొత్స సత్యనారాయణ, సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సర్ది చెప్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. చివరకు ఎట్టకేలకు జగన్ రెడ్డి సర్కార్ అహం వీడింది. కొన్ని రోజుల్లోనే ఏపీలో ఎన్నికలు రానున్నాయి. దీంతో తమ గెలుపుపై ప్రభావం చూపిందని భయపడింది. దెబ్బకు దిగి వచ్చింది.
అంగన్వాడీలు కోరిన విధంగా వేతనాలు పెంచేందుకు సమ్మతించింది. ఈ మేరకు వారితో బొత్స, సజ్జల జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి. రాత పూర్వకంగా హామీ ఇస్తేనే విరమిస్తామని చెప్పడంతో ఓకే చెప్పింది సర్కార్.
ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు అంగన్వాడీలు. 13 డిమాండ్లు కోరారని, వాటిలో 10 డిమాండ్లకు తాము ఒప్పుకున్నామని ఈ సందర్బంగా వెల్లడించారు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణా రెడ్డి.