అంగన్ వాడీలకు సజ్జల వార్నింగ్
విధుల్లో చేరక పోతే చర్యలు తప్పవు
అమరావతి – ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో తమ సమస్యలను పరిష్కరించాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు , ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం దీనిపై ఫోకస్ పెట్టింది. అంగన్ వాడీలు వెంటనే విధులలో చేరాలని లేక పోతే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు సజ్జల రామకృష్ణా రెడ్డి.
ఒకవేళ మొండికేస్తే తమ ప్రభుత్వం చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకవేళ అంగన్ వాడీలు గనుక విధుల్లో చేరకుంటే నిబంధనల ప్రకారం కొత్త వారిని భర్తీ చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
అంగన్ వాడీ కేంద్రాలలో గర్భిణీలు, పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఉండ కూడదనే ఎస్మా పరిధిలోకి తీసుకు వచ్చామని తెలిపారు సజ్జల రామకృష్ణా రెడ్డి. అయితే అంగన్ వాడీలు సమ్మె వెనుక రాజకీయ ప్రయోజనం దాగి ఉందన్నారు. జూలైలో జీతాలు పెంచేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు. తెగే వరకు లాగొద్దని సూచించారు అంగన్ వాడీలకు.