అద్దంకికి షాక్ గౌడ్ కు ఛాన్స్
ఎమ్మెల్సీ అభ్యర్థుల మార్పు
హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీ అంటేనే సంచలనాలకు పెట్టింది పేరు. సీఎం పేరుకు మాత్రమే ప్రధాన నిర్ణయాలన్నీ ఏఐసీసీ హై కమాండ్ చేతుల్లో జరుగుతుంటాయి. తాజాగా తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీకి 64 సీట్లు వచ్చాయి.
తాజాగా తెలంగాణ శాసన మండలిలో ఇద్దరు అభ్యర్థులకు సంబంధించిన స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈనెల 29న పోలింగ్ జరగనుంది. ఇందుకు గాను ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. భారీ మెజారిటీ ఉండడంతో బీఆర్ఎస్ ఒకవేళ బరిలో ఉన్నా ఓటమి పొందడం ఖాయమని తేలి పోయింది.
దీంతో కాంగ్రెస్ పార్టీకి ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలు కీలకంగా మారాయి. అయితే ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో చివరి దాకా బరిలో ఉంటారని అనుకున్నప్పటికీ ఎమ్మెల్యే సీటును కోల్పోయారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్.
నిన్న సంచలన ప్రకటన చేసింది ఏఐసీసీ. రెండు స్థానాలకు ఎన్ఎస్ఐయూ రాష్ట్ర చీఫ్ బల్మూరి వెంకట్ తో పాటు అద్దంకి దయాకర్ ను ఎంపిక చేసింది. ఈ మేరకు ఢిల్లీ నుంచి ఫోన్లు కూడా వారిద్దరికీ వెళ్లాయి. కానీ బుధవారం ఊహించని రీతిలో అద్దంకిని పక్కన పెట్టారు. ఆయన స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ కు ఛాన్స్ ఇచ్చింది పార్టీ.