అద్వానీ..జోషి..కర సేవకులే హీరోలు
వెంకయ్య నాయుడు సంచలన కామెంట్స్
అమరావతి – మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో శ్రీరాముడి పునః ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరగడాన్ని స్వాగతించారు. ఇదే సమయంలో ప్రధానంగా గుర్తు తెచ్చుకోవాల్సింది మాత్రం బీజేపీ సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ , మురళీ మనోహర్ జోషి, కర సేవకులేనని పేర్కొన్నారు.
వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఎక్కడ కూడా ఎవరి పేరు ఉచ్చరించ లేదు. కానీ వారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం ఒకింత ప్రాధాన్యత సంతరించుకుంది.
అద్వానీ అనారోగ్యం కారణంగా హాజరు కాలేక పోతున్నానని స్పష్టం చేశారు. ఇక మొత్తం అన్నీ తానై వ్యవహరించారు ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. మిగతా నేతలు ఎవరూ కనిపించ లేదు. ఇక కార్యక్రమం యూపీలో కొనసాగింది కాబట్టి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ను పక్కన ఉండేలా చూశారు. ఇదే సమయంలో బీజేపీకి రెండు కళ్లుగా భావించే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) బాస్ మోహన్ భగవత్ కీలకంగా ఉన్నారు.