NEWSNATIONAL

అనురాగ్ ఠాకూర్ వైర‌ల్

Share it with your family & friends

గ‌ణ‌తంత్ర వేడుక‌ల్లో హ‌ల్ చ‌ల్

న్యూఢిల్లీ – కేంద్ర క్రీడా, ప్ర‌సార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వైర‌ల్ గా మారారు. న్యూఢిల్లీలో 75వ గ‌ణ‌తంత్ర వేడుక‌ల్లో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు . ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న భార్య‌తో క‌లిసి వేడుక‌ల్లో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల‌కు చెందిన శ‌క‌టాలు ప్ర‌ద‌ర్శించారు. భారీ ఎత్తున ప్ర‌ముఖులు పాల్గొన్నారు.

ప్ర‌త్యేకించి ఎప్ప‌టి లాగే భార‌త దేశ స‌ర్కార్ ఫ్రాన్స్ దేశ అధ్య‌క్షుడు ఎమ్మాన్యూయెల్ మాక్రాన్ ను పాల్గొనాల‌ని ఆహ్వానించింది. ఈ మేర‌కు ఆయ‌న విశిష్ట అతిథిగా హాజ‌ర‌య్యారు. సంతోషానికి లోన‌య్యారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీతో క‌లిసి వీక్షించారు.

రిప‌బ్లిక్ వేడుక‌ల్లో పాల్గొన్న అనంత‌రం మోదీలో క‌లిసి విందుకు హాజ‌ర‌య్యారు. అనంత‌రం అక్క‌డి నుండి గుజ‌రాత్ కు వెళ్లారు. చారిత్రక స్థ‌లాల‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు మాక్రాన్. ప్ర‌జాస్వామ్యానికి నిలువుటద్దంగా భార‌త దేశం నిలుస్తుంద‌ని పేర్కొన్నారు ఎమ్మాన్యూయెల్ మాక్రాన్. ఇదిలా ఉండ‌గా అనురాగ్ ఠాకూర్ స్పందించారు. రాబోయే రోజుల్లో భార‌త్ కు మంచి భ‌విష్య‌త్ ఉంద‌న్నారు.