అభివృద్దికి సహకారం అందిస్తాం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
సత్యసాయి జిల్లా – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతో ముఖాభివృద్దికి శాయ శక్తులా కేంద్రం సహాయం అందజేస్తుందని స్పష్టం చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా పాల సముద్రం గ్రామంలో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం 1.05 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు పీఎం.
రాష్ట్ర గవర్నర్ నజీర్, సీఎం జగన్ మోహన్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, ఎంపీ అవినాష్ రెడ్డి, శాసన మండలి వైఎస్ చైర్మన్ జఖియా ఖానం , కలెక్టర్ విజయ రామరాజు, ఎమ్మెల్సీ రామ చంద్రా రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు, ఎస్.రఘురామిరెడ్డి, సుధీర్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయపల్లి మల్లిఖార్జున రెడ్డి, రాష్ట్ర ఉద్యాన శాఖ సలహా మండలి సలహాదారులు పి.శివప్రసాద్ రెడ్డి సాదర స్వాగతం పలికారు.
నాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ , ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ) అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పీఎం పాల్గొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కోరినవన్నీ తీర్చడం జరిగిందన్నారు. అన్ని రంగాలలో ముందుకు తీసుకు వెళ్లేందుకు గాను సహకారం అందించామన్నారు పీఎం నరేంద్ర దామోదర దాస్ మోదీ.