అభ్యర్థుల ఎంపికపై బాబు ఫోకస్
గుంటూరు జిల్లాలో అభ్యర్థుల ఎంపిక
అమరావతి – రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్ర బాబు నాయుడు దూకుడు పెంచారు. ఆయన ప్రస్తుతం జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. త్వరలోనే బీజేపీతో కూడా దోస్తీ చేయనున్నారు. ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి వచ్చారు. అయితే ఇంకా అభ్యర్థుల ఎంపికపై చర్చలు కొలిక్కి రాలేదు.
ప్రస్తుతానికి కొన్ని జిల్లాల్లో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డారు చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు పడ్డారు. అయినా ఇంకా కొలిక్కి రాలేదు.
గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని శాసన సభ నియోజకవర్గాలకు సంబంధించి టికెట్లను ఖరారు చేయడం విశేషం. ఇక నియోజకవర్గాల వారీగా చూస్తే మంగళగిరి ఎమ్మెల్యే సీటును తన తనయుడు నారా లోకేష్ బాబుకు ఇచ్చారు చంద్రబాబు నాయుడు.
గుంటూరు నషీర్ , ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ , పత్తిపాడు బూర్ల ఆంజనేయులు, పొన్నూరు ధూలిపాల నరేంద్ర, తాడికొండ తెనాలి నాదెండ్ల మనోహర్ ను ఖరారు చేశారు. ఇదిలా ఉండగా అనకాపల్లికి సంబంధించి ఇంకా సీటు కన్ ఫర్మ్ చేయలేదు.