అయోధ్యకు వెళితే తప్పేంటి
సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
దావోస్ – తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఈనెల 22న దేశ వ్యాప్తంగా ఉత్కంఠతో ఎదురు చూస్తోంది అయోధ్య లోని రాముడి పునః ప్రతిష్ట కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు పీఎం నరేంద్ర మోదీ.
లక్షలాది మంది ఈ కార్యక్రమానికి వెళుతున్నారు. దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. వీరిలో క్రికెటర్లు, ఆటగాళ్లు, సినీ రంగానికి చెందిన నటీ నటులు, దర్శకులకు ఇన్విటేషన్లు ఇచ్చింది స్వయంగా రామ జన్మ భూమి ట్రస్టు.
ఇదిలా ఉండగా దావోస్ టూర్ లో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా ప్రముఖ ఛానల్ తో ఆయన మాట్లాడారు. భద్రాచలం వెళ్లినట్లే రామ మందిరాన్ని కూడా సందర్శిస్తానని చెప్పారు. రెండు దేవాలయాల మధ్య తేడా లేదన్నారు.
రామ మందిరం అనేది ఏ ఒక్కరికో చెందినది కాదన్నారు రేవంత్ రెడ్డి. బీజేపీతో దానికి సంబంధం లేదన్నారు. అసంపూర్తిగా నిర్మించిన దేవాలయానికి నిజమైన హిందూ విశ్వాసులు వెళ్ల లేరన్నారు సీఎం. ఎవరికి నమ్మకం ఉంటే వారు వెళ్ల వచ్చని, ఇందులో ఎలాంటి అభ్యంతరం లేదన్నారు రేవంత్ రెడ్డి.