DEVOTIONAL

అయోధ్య‌లో ద‌ర్శ‌న వేళ‌లు మార్పు

Share it with your family & friends

రాత్రి 10 గంట‌ల దాకా ద‌ర్శ‌న భాగ్యం
ఉత్త‌ర ప్ర‌దేశ్ – అయోధ్య లోని రామ మందిరంలో బాల రాముడు కొలువు తీరాడు. దీంతో దేశ , విదేశాల నుంచి భారీ ఎత్తున ద‌ర్శించు కునేందుకు భ‌క్తులు త‌ర‌లి వ‌స్తున్నారు. వీరిని నియంత్రించ‌డం ఇబ్బందిగా మారింది శ్రీ‌రామ ఆల‌య ట్ర‌స్టుకు. దీంతో ద‌ర్శ‌న వేళ‌ల‌ను మార్చుతూ నిర్ణ‌యం తీసుకుంది.

ఓ వైపు చ‌లి వ‌ణికిస్తున్నా లెక్క చేయ‌కుండా త‌ర‌లి వ‌స్తున్నారు భ‌క్తులు. భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో పెట్టుకుని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కీలక నిర్ణయం తీసుకుంది. అధిక సంఖ్యలో భక్తులు రామ్‌లల్లాను చూసేందుకు, పూజలు చేసేందుకు అవకాశాన్ని కల్పించాలని దర్శన సమయాల్లో మార్పులు చేసింది.

ఇక‌పై ఉద‌యం 4.30 గంట‌ల‌కే రామ్ ల‌ల్లా ద‌ర్శ‌న భాగం క‌లుగ‌నుంది.. రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు బాల‌రాముడిని భ‌క్తులు వీక్షించ‌వ‌చ్చు. రామ భక్తులకు ఇకపై దర్శనానికి మరో గంట సమయం అదనంగా ల‌భించ‌నుంది.

ఇక ద‌ర్శ‌న వేళ‌ల‌కు సంబంధించి చూస్తే ఉద‌యం 4.30 గంట‌ల‌కు మంగ‌ళ హార‌తి, 6.30 గంట‌ల‌కు ఉత్తాన్ హార‌తి, 7 గంట‌ల నుండి ద‌ర్శ‌నం క‌ల్పించ‌నున్నారు. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు భోగ్ హార‌తి, రాత్రి 7.30 గంట‌ల‌కు సాయంత్రం హార‌తి, రాత్రి 9 గంట‌ల‌కు భోగ్ హార‌తి, రాత్రి 10 గంట‌ల‌కు శ‌య‌న హార‌తి ఉంటుంద‌ని ట్ర‌స్టు తెలిపింది.