అయోధ్యలో పీటీ ఉష..మెగాస్టార్
రామ్ చరణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్
ఉత్తర ప్రదేశ్ – అయోధ్య రామ మందిరం పునః ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి అన్నీ తానై వ్యవహరించారు. మోదీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ శ్రీరాముడి ఆలయంలోకి ప్రవేశించారు. ఈ సందర్బంగా పూజలలో పాల్గొన్నారు.
ఇక దేశ వ్యాప్తంగా 7000 మంది ప్రముఖులకు శ్రీరా మందిరం ట్రస్టు ఆహ్వానాలు పంపింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లక్ష లడ్డూల శ్రీవారి ప్రసాదాన్ని ఇప్పటికే చేర్చింది. ఇదే సమయంలో సినీ, క్రీడా, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన అతిరథ మహారథులు, కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు అయోధ్యకు చేరుకున్నారు.
ఇదిలా ఉండగా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పీటీ ఉషతో పాటు ప్రముఖ నటులు మెగాస్టార్ చిరంజీవి, భార్య సురేఖ, తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూఢా హాజరయ్యారు. అంతకు ముందు తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం ప్రధాన ఆకర్షణగా నిలిచారు. మొత్తంగా అయోధ్య జై శ్రీరామ్ పేరుతో మారుమ్రోగుతోంది.