NATIONALNEWS

అవినీతికి కేరాఫ్ అస్సాం స‌ర్కార్

Share it with your family & friends

నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
అస్సాం – ఏఐసీసీ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆయ‌న అస్సాం ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఈ దేశంలో అత్యంత అవినీతిమ‌య‌మైన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది హిమంత బిశ్వా శ‌ర్మ సార‌థ్యంలోని బీజేపీ అస్సాం స‌ర్కార్ అంటూ మండిప‌డ్డారు. ఇవాళ అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నాశ‌నం చేశారంటూ ఆరోపించారు.

భార‌త్ జోడో న్యాయ్ యాత్ర‌లో భాగంగా గురువారం ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు రాహుల్ గాంధీ. ఈ దేశంలో అన్యాయంపై ఎలుగెత్తి చాటేందుకే తాను ఈ యాత్ర చేప‌ట్టాన‌ని అన్నారు . అవినీతిపై యుద్దం ఆగ‌ద‌న్నారు. ప్ర‌శ్నించే వాళ్లు లేక పోతే ఈ దేశాన్ని అమ్మేస్తారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

పేద‌లు ఇంకా పేద‌లుగానే ఉండి పోతున్నార‌ని ఆవేద‌న చెందారు. విద్య‌, వైద్యం, ఉపాధి అన్న‌ది మోదీ పాల‌న‌లో నిర్ల‌క్ష్యానికి గుర‌య్యాయ‌ని వాపోయారు. కేవ‌లం అదానీ, అంబానీ, టాటాల జ‌పం మాత్ర‌మే చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు రాహుల్ గాంధీ.

కూలి పోయిన వ్య‌వ‌స్థ‌ల‌ను తిరిగి నిలబెట్టేందుకే తాను న్యాయ్ యాత్ర మొద‌లు పెట్టాన‌ని , అశేతు భార‌త‌మంతా త‌నకు మ‌ద్ద‌తుగా నిలిచింద‌ని అన్నారు. వారంద‌రికీ ఈ సంద‌ర్బంగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ చేసుకుంటున్నాన‌ని అన్నారు రాహుల్ గాంధీ.