ఆకట్టుకున్న తెలంగాణ శకటం
సీఎం రేవంత్ రెడ్డి చొరవతో
న్యూఢిల్లీ – 75వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా న్యూఢిల్లీలో జరిగిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రత్యేకించి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తయారు చేసిన శకటం హాజరైన వారిని మెస్మరైజ్ చేసింది. మదర్ ఆఫ్ డెమోక్రసీ థీమ్ ఆఫ్ తెలంగాణ పేరుతో దీనిని రూపొందించారు.
వారం రోజులకు పైగా కష్టపడ్డారు. ఇదిలా ఉండగా మన రాష్ట్రానికి చెందిన శకటం ప్రదర్శించేందుకు నానా తంటాలు పడ్డారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. గతంలో కొలువు తీరిన బీఆర్ఎస్ ప్రభుత్వం పంతానికి పోయి తెలంగాణ శకటాన్ని ప్రదర్శించ లేదు. దాదాపు మూడు సంవత్సరాలుగా అక్కడ ప్రదర్శించ లేదు మన శకటం.
రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ కూలి పోయింది. దాని స్థానంలో కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చింది. విషయం గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీని కలుసుకున్నారు. ఎలాగైనా సరే తెలంగాణ శకటానికి అవకాశం ఇవ్వాలని విన్నవించారు. పీఎం చొరవతో వెంటనే ఆమోదం లభించింది.
లక్షలాది మంది సాక్షిగా ఇవాళ హస్తినలో తెలంగాణ శకటం ప్రదర్శనకు నోచుకుంది. మొత్తంగా సీఎం తన మార్క్ ఏమిటో చూపించారు.