ఆధ్యాత్మికం జీవన సౌరభం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
తమిళనాడు – జీవన ప్రయాణంలో ఆధ్యాత్మికత అనేది అత్యంత ప్రాముఖ్యత వహిస్తుందన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. తమిళనాడులో ప్రస్తుతం ఆయన పర్యటించారు. ఈ సందర్బంగా పేరు పొందిన రాముడికి చెందిన ఆలయాలను సందర్శించారు.
తాజాగా కోతండ రామ స్వామి ఆలయంలో పూజలు చేశారు. అంతకు ముందు సముద్ర తీరంలో పుణ్య స్నానం చేశారు. ఆ తర్వాత గుడి లోకి విచ్చేశారు. ఈ సందర్బంగా పూజారులు ప్రధానికి స్వాగతం పలికారు. అనంతరం కోదండ రామ స్వామికి మొక్కులు తీర్చుకున్నారు మోదీ.
అనంతరం ట్విట్టర్ వేదికగా ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని. అన్ని సమస్యలకు ఇందులోనే పరిష్కారం దొరుకుతుందన్నారు. ఎంత సంపాదించినా ఏదో ఒక రోజు శాశ్వతమైన నిద్రలోకి జారు కోవాల్సిందేనని పేర్కొన్నారు ప్రధాని.
స్వాంతన చేకూర్చే ప్రతి ఒక్క దానిని స్వాగతించాలని సూచించారు. దీనికి సరైన మార్గం ఆధ్యాత్మికం ఒక్కటేనని స్పష్టం చేశారు నరేంద్ర దామోదర దాస్ మోదీజీ. రేపు అయోధ్యలో శ్రీరాముడి పునః ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటారు. 11 రోజుల దీక్ష చేపట్టారు.