NEWSTELANGANA

ఆర్టీసీ కార్మికుల సేవ‌లు ప్ర‌శంస‌నీయం

Share it with your family & friends

రిటైర్డ్ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్క‌ర‌ణ

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) అందిస్తున్న సేవ‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌ని అన్నారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ. ఆర్టీసికి సంబంధించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు. తెలంగాణ పోరాటంలో వారు చేసిన త్యాగం గొప్ప‌ద‌న్నారు. గ‌త ప్ర‌భుత్వం వారిని న‌మ్మించి మోసం చేసింద‌న్నారు.

ఇవాళ తాము అధికారంలోకి రావ‌డానికి ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, రిటైర్డ్ ఎంప్లాయిస్, వారి పిల్ల‌లు, కుటుంబం మొత్తం త‌మ‌కు అండ‌గా ఉండ‌డం వ‌ల్ల చాలా చోట్ల గెల‌వ గ‌లిగామ‌ని అన్నారు మాజీ ఎంపీ మ‌ధు యాష్కి గౌడ్.

ఇదిలా ఉండ‌గా ఆర్టీసీలో ప‌ద‌వీ విర‌మ‌ణ ఉద్యోగుల సంఘం ఆధ్వ‌ర్యంలో 2024 సంవ‌త్స‌రానికి సంబంధించిన డైరీని దీపా దాస్ మున్షీతో పాటు మ‌ధు యాష్కి గౌడ్ ఆవిష్క‌రించారు. గౌడ్ ఎంప్లాయిస్ యూనియ‌న్ కు గౌర‌వ అధ్యక్షుడిగా ఉన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం వర్కింగ్ అధ్యక్షుడు ఎం.ఏ.రెహ్మాన్ సూఫీ, జనరల్ సెక్రటరీ బివి కోటయ్య, కోశాధికారి బుచ్చిరెడ్డి, కార్యదర్శులు మునగాల మనోహర్, భూపాల్ రెడ్డి, పూస నర్సింహా బెస్త తదితరులు పాల్గొన్నారు.