DEVOTIONAL

ఆల‌యాల శుభ్ర‌త మ‌నంద‌రి బాధ్య‌త‌

Share it with your family & friends

నాసిక్ లోని కాలారామ్ ఆల‌యంలో పీఎం

నాసిక్ – దేశ ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ ఏది చేసినా సంచ‌ల‌న‌మే. గ‌తంలో దేశంలో స్వ‌చ్ఛ భార‌త్ పేరుతో అద్భుత‌మైన కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. అది బిగ్ స‌క్సెస్ అయ్యింది. ఇదే స‌మ‌యంలో దేశంలో భారీ ఎత్తున ఆల‌యాలు కొలువు తీరి ఉన్నాయి. మోదీ పీఎం అయ్యాక భ‌క్తి, టెంపుల్స్ కు సంబంధించిన చైత‌న్యం ప్ర‌జ‌ల్లో పెరిగింది. ఒక ర‌కంగా పెద్ద ఎత్తున భ‌క్తి భావం పెరుగుతోంది.

ఇదే క్ర‌మంలో మ‌రో కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. నాసిక్ లోని కాలా రామ్ ఆల‌యానికి చేరుకున్నారు. అక్క‌డ ఆల‌యాన్ని శుభ్రం చేసే ప‌నిని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మోదీ పిలుపునిచ్చారు దేశ ప్ర‌జ‌ల‌కు. అదేమిటంటే మీమీ ప్రాంతాల‌లో దేశంలోని అన్ని ఆల‌యాలు, ప్రార్థ‌నాల మందిరాల (మ‌సీదులు, చ‌ర్చీలు)ను శుభ్రం చేయాల‌ని కోరారు.

ఈ మేర‌కు తాను స్వ‌యంగా చీపురు ప‌ట్టి ఊడ్చే ప‌నిని చేప‌ట్టారు. మీరంతా ఈ ప‌విత్ర‌మైన కార్య‌క్ర‌మంలో పాలు పంచు కోవాల‌ని త‌మ జ‌న్మ‌ను ధ‌న్యం చేసుకోవాల‌ని సూచించారు న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీజీ.

జ‌న‌వ‌రి 14 నుంచి 22 వ‌ర‌కు అన్నింటిని శుభ్ర ప‌రిచే ప్ర‌చారం ఊపందు కోవాల‌ని సూచించారు. 11 రోజుల పాటు రామ మందిరం ప్రారంభోత్సానికి ముందు జ‌రిగే కార్య‌క్ర‌మాల‌ను ఆయ‌న ప్రారంభించారు. త‌న జీవితంలో తొలిసారి భావోద్వేగానికి లోన‌వుతున్నాన‌ని ప్ర‌ధాని చెప్పారు. శ్రీ‌రాముడి విగ్ర‌హం ప్రాణ ప్ర‌తిష్ట‌ను వీక్షించ‌డం ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాన‌ని తెలిపారు.