ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్
కసరత్తు చేస్తున్న సీఎం జగన్ రెడ్డి
అమరావతి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇటు అసెంబ్లీ అటు లోక్ సభ ఎన్నికలపై దృష్టి పెట్టారు. ప్రధానంగా ప్రస్తుతం ఉన్న వారి పనితీరు, సామాజిక సమీకరణల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడినట్టు సమాచారం. ఆయా లోక్ సభ నియోజకవర్గాల వారీగా చూస్తే శ్రీకాకులం ఎంపీగా దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. ప్రస్తుతం ధర్మాన కృష్ణ ప్రసాద్, తమ్మినేని సీతారాం, కిల్లి కృపారాణఙ, పిరియా విజయ పరిశీలనలో ఉన్నారు.
విజయనగరం ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ ఉండగా ప్రస్తుతం పరిశీలనలో శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ ఉండే ఛాన్స్ ఉంది. ఇక విశాఖ పట్నం నుంచి సత్యనారాయణ ఎంపీగా ఉన్నారు. ఇక్కడ బొత్స సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మీని నిలబెట్టాలని ఆలోచనలో ఉన్నట్టు టాక్.
అరకు ఎంపీగా గొడ్డేటి మాధవి ఉండగా పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని ఖరారు చేశారు. అనకాపల్లి ఎంపీగా బీఏ సత్యవతి ఉండగా కరణం ధర్మశ్రీకి ఇవ్వాలని చూస్తున్నారు. కాకినాడ ఎంపీగా వంగా గీత ఉండగా చలమల శెట్టి సునీల్ పేరు పరిశీలనలో ఉంది.
అమలాపురం ఎంపీగా చింతా అనురాధ ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆమెను కాదని ఎలీజాకు ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక రాజమండ్రి నుంచి మార్గాని భరత్ ఎంపీగా ఉండగా ఆయన స్థానంలో డాక్టర్ అనుసూరి పద్మలతను ఎంపిక చేయనున్నట్లు టాక్.
నరసాపురం నుంచి రఘురామకృష్ణం రాజు ఎంపీగా ఉండగా ఆయనను కాదని గోకరాజు గంగరాజుకు కన్ ఫర్మ్ చేసినట్లు తెలిసింది. ఏలూరు ఎంపీగా కోటగిరి శ్రీధర్ ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆయన స్థానంలో ఆళ్ల నాని, కొట్టు సత్య నారాయణ, అరసవిల్లి అరవింద్ , వీవీ వినాయక్ పేర్లు కొత్తగా వినిపిస్తున్నాయి.
మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన స్థానంలో డైరెక్టర్ వినాయక్ కు ఇవ్వనున్నట్లు సమాచారం. విజయవాడ పీవీపీ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన స్థానంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను తీసుకు రావాలని చూస్తున్నారు.
గుంటూరు నుంచి వేణుగోపాల్ రెడ్డి బరిలో ఉండగా ఆయన స్థానంలో లావు శ్రీకృష్ణ దేవరాయులుకు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన ఇప్పటికే నరసారావుపేట నుంచి ఎంపీగా ఉన్నారు. ఇక్కడ వేణు గోపాల్ రెడ్డిని తీసుకు రావాలని అనుకుంటున్నారు.
ఇక బాపట్ల విషయానికి వస్తే నందిగం సురేష్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయనకే టికెట్ దక్కనుంది. ఒంగోలు నుంచి ప్రస్తుతం ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉండగా ఈసారి వైవీ సుబ్బారెడ్డి తనయుడు వైవీ శ్రీకాంత్ రెడ్డితో పాటు దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ లో ఎవరో ఒకరికి ఇస్తారని సమాచారం.
నంద్యాల నుంచి ఎంపీగా బ్రహ్మానందరెడ్డి ఉండగా సినీ నటుడు అలీని నిలబెట్టనున్నారు. కర్నూలు నుంచి ఎంపీగా సంజీవ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తుండగా మంత్రిగా ఉన్న జయరాంను నిలబెట్టే ఛాన్స్ ఉంది.
అనంతపురం నుంచి తలారి రంగయ్య ఉండగా పెనుగొండ ఎమ్మెల్యే శంకర నారాయణకు టికెట్ ఇచ్చారు. హిందూపురం నుంచి జె శాంతమ్మ, కడప నుండి వై అవినాశ్ రెడ్డి, నెల్లూరు నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డికి బదులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది.
తిరుపతి నుండి గురుమూర్తి, రాజంపేట నుండి మిథున్ రెడ్డి, చిత్తూరు నుండి రెడ్డప్ప లకే తిరిగి టికెట్లు ఇవ్వనున్నారు జగన్ రెడ్డి.