ఎన్నికల్లో జనసేన సత్తా చాటాలి
స్పష్టం చేసిన నాదెండ్ల మనోహర్
రాజమండ్రి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే శాసన సభ , సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ . రాజమండ్రిలో ఆయన పర్యటించారు. ఈ సందర్బంగా పార్టీకి చెందిన ముఖ్య నేతలు, కార్యకర్తలు, బాధ్యులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు నాదెండ్ల మనోహర్.
తూర్పు గోదావరి జిల్లా మన పార్టీకి అత్యంత కీలకమని స్పష్టం చేశారు. జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని సూచించారు. ఇందుకు అవసరమైన సలహాలు, సూచనలు తాము ఇస్తామని చెప్పారు.
తెలుగుదేశం పార్టీ నేతలతో సమన్వయం చేసుకోవడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు నాదెండ్ల మనోహర్. పదవుల కోసం కాకుండా కలిసికట్టుగా ముందుకు సాగాలని, జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ను దించడమే లక్ష్యంగా పని చేయాలని స్పష్టం చేశారు.
రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ప్రజలు జగన్ రెడ్డిని ఇంటికి పంపించేందుకు సిద్దమై ఉన్నారని అన్నారు నాదెండ్ల మనోహర్.