ఎన్నికల నిర్వహణపై ఎస్పీ ఫోకస్
అవార్డులు..రివార్డులు అవసరం లేదు
తిరుపతి – ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రీ పోలింగ్ జరగకుండా చూడాలని స్పష్టం చేశారు తిరుపతి ఎస్పీ మలిక గర్గ్. జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికలు 2024 నిర్వహణపై జిల్లా పోలీస్ అధికారులకు శిక్షణ ఇచ్చారు.
అవార్డులు, రివార్డులు అవసరం లేదన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. మనందరికీ ఈ మూడు నెలలే కీలకమన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ఈ సమయంలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
శాంతి , భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. గత ఎన్నికలలో రీ-పోలింగ్ జరిగిన, సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ నైతిక విలువలు పాటిస్తూ మనస్ఫూర్తిగా విధులు నిర్వర్తించాలని. తమ పిల్లలకు ఆదర్శంగా నిలవాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
పోలీస్ ఠాణాకు వచ్చే వారంతా బాధితులేనని, వారి పట్ల దయతో ఉండాలని సూచించారు మలిక గర్గ్.