ఎమ్మెల్సీలుగా కోదండరాం..అలీఖాన్
గవర్నర్ కోటాలో ఆమోదించిన తమిళి సై
హైదరాబాద్ – ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. ముందుగా కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగానే ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. ఇదే సమయంలో పత్రికా పరంగా విశిష్ట సేవలు అందించిన
మీర్ అమీర్ అలీ ఖాన్ కు కూడా మైనార్టీ సామాజిక వర్గం కింద ప్రతిపాదించింది. గురువారం గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆమోదం తెలిపారు. దీంతో ఈ ఇద్దరు ఇప్పుడు ఎమ్మెల్సీలు అయ్యారు.
ఇక కోదండరాం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ముందు నుంచీ ప్రజల కోసం పని చేశారు. తన గొంతు వినిపించారు. సమస్యలను ప్రస్తావిస్తూ వచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అంతే కాదు ఆయనను ఎంతగా ఇబ్బంది పెట్టినా ఓర్చుకున్నారు.
ఇదే సమయంలో సకల జనులను ఒక్కటిగా చేయడంలో కోదండరాం కృషి గొప్పది. అయితే గత కేసీఆర్ సర్కార్ ఆయనపై కక్ష కట్టింది. చివరకు అరెస్ట్ చేసేంత దాకా తీసుకు వెళ్లింది. అయినా ఎక్కడా వెనుతిరిగి చూడలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చినా విజయం సాధించ లేదు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయలేదు. బేషరతుగా సపోర్ట్ చేశారు. ఈ మేరకు పార్టీ ఆయనకు సంపూర్ణ సహకారం అందించింది. ఇదే సమయంలో పత్రికా పరంగా చేసిన సేవలకు గాను మీర్ అమీర్ అలీ ఖాన్ కు ఛాన్స్ ఇచ్చింది.