NEWSANDHRA PRADESH

ఎవ‌రీ ఉషా చిలుకూరి ఏమిటా క‌థ

Share it with your family & friends

గెలిస్తే యుఎస్ కు రెండో మ‌హిళ

అమ‌రావ‌తి – యావ‌త్ ప్ర‌పంచం ఇప్పుడు ఉషా చిలుకూరి వాన్స్ ఎవ‌రంటూ వెతుకుతోంది. ఇందుకు కార‌ణం ప్ర‌స్తుతం అమెరికాలో జోరుగా ఎన్నిక‌ల ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సంద‌ర్బంగా ఉన్న‌ట్టుండి ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో త‌న త‌ర్వాత వైస్ ప్రెసిడెంట్ గా జేడీ వాన్స్ అంటూ ప్ర‌క‌టించాడు గ్రాండ్ ఓల్డ్ పార్టీ చీఫ్ , మాజీ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇంత‌కీ జేడీ వాన్స్ ఎవ‌ర‌ని అనుకుంటున్నారా ఆయ‌న సెనేట‌ర్ ..అంతే కాదు తెలుగుంటి అమ్మాయి , ఏపీకి చెందిన తెలుగు మూలాలు క‌లిగిన‌ ఉషా చిలుకూరి వాన్స్ కు భ‌ర్త‌. దీంతో ఒక‌వేళ ట్రంప్ గ‌నుక గెలిస్తే అమెరికా లాంటి పెద్ద‌న్న దేశానికి ఉపాధ్యుక్షుడ‌య్యే ఛాన్స్ ఎక్కువ‌గా ఉంది జేన్స్ వాన్ కు. దీంతో ఉషా చిలుకూరి రెండో మ‌హిళ‌గా చ‌రిత్ర సృష్టించ‌నున్నారు.

ఆమెకు చ‌రిత్ర అంటే వ‌ల్ల‌మాలిన అభిమానం. యేల్ యూనివ‌ర్శిటీ నుండి డిగ్రీని, కేంబ్రిడ్జ్ యూనివ‌ర్శిటీ నుండి మాస్ట‌ర్ ఆఫ్ ఫిలాసఫీ చ‌దివారు. అద్భుత‌మైన విద్యా నేప‌థ్యం క‌లిగి ఉన్నారు. భార‌తీయ సంస్కృతి, సంప్ర‌దాయాల‌కు ప్ర‌తీకగా ఇప్ప‌టి వ‌ర‌కు నిలిచారు. న్యాయ విద్య ప‌ట్ల ప‌ట్టు క‌లిగి ఉన్నారు. గ‌తంలో సుప్రీంకోర్టు జ‌డ్జీలుగా ప‌నిచ ఏసిన జాన్ రాబ‌ర్ట్స్ , బ్రెట్ క‌వ‌నాగ్ ల‌కు క్ల‌ర్క్ గా ప‌నిచేశారు. న్యాయ రంగంలో విశిష్ట‌మైన అనుభ‌వం గడించారు. యేల్ జ‌ర్న‌ల్ ఆఫ్ లా , టెక్నాల‌జీకి మేనేజింగ్ ఎడిట‌ర్ గా ప‌నిచేశారు. ది యేల్ లా జ‌ర్న‌ల్ కు ఎగ్జిక్యూటివ్ డెవ‌ల‌ప్ మెంట్ ఎడిట‌ర్ గా సేవ‌లు అందించారు ఉషా చిలుకూరి వాన్స్.

ఇదిలా ఉండ‌గా ఉషా యేల్ లా స్కూల్ లో జేడీ వాన్స్ క‌లుసుకున్నారు. 2014లో పెళ్లి చేసుకున్నారు. ఆమెకు ఇప్పుడు 38 ఏళ్లు. జేడీ వాన్స్ క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చాడు. ఆయ‌న విజ‌యంలో ఉషా కీల‌క పాత్ర పోషించారు. రాబోయే రోజుల్లో భార‌త‌, అమెరికా దేశాల మ‌ధ్య మ‌రింత బంధాన్ని ప‌టిష్టం చేయ‌డంలో ఉషా చిలుకూరి కీల‌క‌మైన పాత్ర పోషించే ఛాన్స్ ఉంద‌ని పేర్కొంటున్నారు అమెరిక‌న్లు.