ఏపీకి కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ
నియమించిన ఏఐసీసీ
అమరావతి – ఏఐసీసీ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి నూతన అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలా రెడ్డిని నియమించింది. ఇంతకు ముందు ఉన్న గిడుగు రుద్రరాజును ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వాన కమిటీ సభ్యుడిగా ఖరారు చేసింది.
ఏపీలో శాసన సభ, సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మేనిఫెస్టో కమిటీని ప్రకటించింది. ఎన్నికల్లో ప్రజలకు ఏం చేస్తామో చెప్పేందుకు మేనిఫెస్టోను తయారు చేస్తుంది.
ఇందులో భాగంగా ఏపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజును నియమించింది. వీరితో పాటు 11 మందితో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులుగా కనుమూరి బాపిరాజు, జేడీ శీలం, తులసీ రెడ్డి, జంగా గౌతమ్ , ఉషా నాయుడు, కమలమ్మ, నజీరుద్దీన్, కొరివి వినయ్ కుమార్, కారుమంచి రమాదేవి, గంగాదర్ లను నియమించింది. ఈ విషయాన్ని ఏఐసీసీ అధికారికంగా వెల్లడించింది.