ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల
నియమించిన ఏఐసీసీ హైకమాండ్
న్యూఢిల్లీ – ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలా రెడ్డిని నియమించింది ఏఐసీసీ హైకమాండ్. ఏపీ రాజకీయాలలో ఇది ఊహించని పరిణామం. ప్రస్తుతం ఏపీ సీఎంగా వైఎస్ గన్ మోహన్ రెడ్డి ఉన్నారు. వైఎస్ షర్మిలకు స్వయాన సోదరుడు. ఇప్పుడు ఇద్దరి మధ్య ఏపీలో అన్నా చెల్లెళ్ల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ జరగనుంది. ఇది ఎవరూ ఊహించని పరిణామం.
ఇదే సమయంలో నిన్న అనూహ్యంగా ఇప్పటి వరకు బాధ్యతలు చేపట్టిన గిడుగు రుద్రరాజు తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు అందజేశారు. ప్రస్తుతం గిడుగు ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రను చేపట్టారు.
ఈనెల 14న మణిపూర్ లోని ఇంఫాల్ నుంచి తన యాత్రను ప్రారంభించారు. వచ్చే మార్చి 20 లేదా 21 వరకు న్యాయ్ యాత్ర కొనసాగుతుంది. ఇదిలా ఉండగా ఏఐసీసీ మరో కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా గిడుగు రుద్రరాజును నియమించింది.