ఏపీ సర్కార్ కు హైకోర్టు షాక్
సింగిల్ జడ్జి ఆదేశాలు చెల్లుతాయి
అమరావతి – రాష్ట్రంలో ఎన్నికల వేళ కోలుకోలేని షాక్ తగిలింది జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ సర్కార్ కు. రాజధాని కార్యాలయాల తరలింపుపై సింగిల్ జడ్జి జారీ చేసిన ఆదేశాలు కొనసాగుతాయని, ఇందులో మార్పు అంటూ ఏమీ ఉండదని స్పష్టం చేశారు.
ఈ మేరకు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టలేమంటూ పేర్కొంది ఇవాళ చేపట్టిన ఏపీ హైకోర్టు. మీరే త్రిసభ్య ధర్మాసనానికి పంపాలని స్పష్టం చేసింది. అయితే అప్పీలును ఎవరు వినాలనే దానిపై త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.
ఇదిలా ఉండగా క్యాంప్ ఆఫీస్ పేరుతో రాజధాని ఆఫీసుల తరలింపుపై సుదీర్ఘ విచారణ జరిగింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. పాలనా పరంగా ఇబ్బందులు ఉండకుండా ఉండేందుకే రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు.
అయితే ఎన్ని కార్యాలయాలు, ఎంత మంది అధికారులు విశాఖకు తరలిస్తారనే అంశంపై వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఎంత మంది అధికారులు వెళతారని ప్రశ్నించారు.