ఏపీ సర్కార్ ఖుష్ కబర్
త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్
అమరావతి – ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఈ మేరకు సంక్రాంతి పండుగ అనంతరం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
టీచర్ల భర్తీకి సంబంధించి వివరాలు తమకు అందించారని, ఇదే విషయానికి సంబంధించి సీఎం జగన్ మోహన్ రెడ్డితో చర్చించడం జరిగిందన్నారు. త్వరలో పోస్టులు, ఖాళీలు, వివరాలతో కూడిన నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఎలాంటి పైరవీలకు తావు అంటూ ఉండదన్నారు.
ఇప్పటికే తాము ప్రకటించిన విధంగా పోస్టుల భర్తీ చేపడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పరిధిలో ఉన్న శాఖలలో ఖాళీగా ఉన్న వాటిని పూర్తి చేశామన్నారు. ఇదే సమయంలో దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యాభివృద్ది కోసం కృషి చేయడం జరిగిందన్నారు.
ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దడం జరిగిందని చెప్పారు. నిరుద్యోగులు కష్టపడి చదువుకుంటే టీచర్లు అవుతారని సూచించారు బొత్స సత్యనారాయణ.