ఏపీ సర్కార్ బేకార్
చంద్రబాబు ఫైర్
అమరావతి – ఏపీలో కొలువు తీరిన వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. ఆదివారం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎంతో కష్టపడి పెట్టుబడులు తీసుకు వచ్చానని, వేలాది మందికి జాబ్స్ ఇచ్చానని అన్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డి వచ్చాక రాష్ట్రాన్ని దోచుకోవడానికి కేరాఫ్ గా మార్చాడని ఆరోపించారు.
ప్రజలు తగిన రీతిలో వైసీపీకి బుద్ది చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు. ఎవరు పని చేయగలరో వారికి తెలుసన్నారు. రాబోయే రోజుల్లో జరిగే శాసన సభ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీ కూటమి పవర్ లోకి రావడం స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు.
గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఏ హామీని జగన్ మోహన్ రెడ్డి అమలు చేయలేదని ఆరోపించారు. కేవలం ప్రజలను మోసం చేయడం తప్ప మరేమీ జరగలేదన్నారు. ఇవాళ అన్ని వ్యవస్థలు నిర్వీర్యమై పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలు సుపరిపాలనను కోరుకుంటారని, కానీ ఇలాంటి అరాచక పాలన కానే కాదన్నారు. విచిత్రం ఏమిటంటే ఇవాళ ఎక్కడ చూసినా రాష్ట్రంలో గంజాయి దొరుకుతోందని, ఇదేనా మీ నిబద్దత అంటూ ప్రశ్నించారు నారా చంద్రబాబు నాయుడు.
ఆయన అరాచక పాలనను తట్టుకోలేక చాలా మంది నేతలు టీడీపీలోకి తిరిగి వస్తున్నారని స్పష్టం చేశారు.