కక్ష కట్టారు కేసులు బనాయించారు
నిప్పులు చెరిగిన పల్లా రాజేశ్వర్ రెడ్డి
హైదరాబాద్ – తనపై కాంగ్రెస్ సర్కార్ కక్ష కట్టిందని , అందుకే తప్పుడు కేసులు బనాయించిందని ఆరోపించారు భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. తాను , తన భార్య ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. తాము ఎవరి భూములను ఆక్రమించ లేదని, జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్దమని పేర్కొన్నారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా పోలీసులు తనపై , భార్యపై కేసు నమోదు చేశారంటూ మండిపడ్డారు. అయినా తాము భయపడే ప్రసక్తి లేదన్నారు. అధికారం ఉంది కదా అని రెచ్చి పోతే, ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.
తాను కానీ, తన భార్య కానీ ఏనాడూ భూముల గురించి గొడవకు దిగలేదన్నారు. తాను అమాయకుడినని, తన భార్యకు ఈ లోకం గురించి అస్సలు తెలియదన్నారు. ఒకరికి సహాయ పడటం తప్ప తాము ఎవరినీ మోసం చేయలేదన్నారు. విద్యా పరంగా , సామాజిక సేవా పరంగా విశిష్ట రీతిలో సేవలు అందజేయడం జరిగిందని చెప్పారు. ఇకనైనా బక్వాస్ కేసులు బంద్ చేయాలని హితవు పలికారు.