కాంగ్రెస్ కు షాక్ ఖాతాలు సీజ్
రూ. 210 కోట్లు రికవరీ
న్యూఢిల్లీ – త్వరలో దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో దేశంలోనే అత్యంత పురాతనమైన , వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన పార్టీగా గుర్తింపు పొందింది కాంగ్రెస్ పార్టీ. తాజాగా ఆదాయ పన్ను శాఖ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింప చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇది ఒక రకంగా పార్టీ చీఫ్ ఖర్గేకు, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ , సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీకి బిగ్ షాక్ అని చెప్పక తప్పదు. మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే ఈడీ రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీని విచారించింది.
నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ ఇటీవల డబ్బులను క్రౌడ్ ఫండింగ్ ద్వారా విరాళాలు సేకరించింది. భారీ ఎత్తున డబ్బులు సమకూరినట్లు సమాచారం. దీంతో వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఎందుకు తమకు తెలియ చేయలేదంటూ వివరణ కోరింది ఐటీ.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేక పోవడంతో వెంటనే ఆ పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయాలని ఆదేశించింది.