కాంగ్రెస్ కోఆర్డినేటర్ల ఎంపిక
పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్
హైదరాబాద్ – త్వరలోనే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సంబురం ప్రారంభం కానుంది. దీంతో ఈసారి ఎలాగైనా సరే పవర్ లోకి రావాలని పావులు కదుపుతోంది హస్తం. ఇప్పటికే కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ ఇతర పార్టీలతో సమన్వయం చేసుకునే పనిలో పడింది.
ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా కర్ణాటక, తెలంగాణలలో జెండా ఎగరేసింది. ఇదే సమయంలో రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలను కోల్పోయింది. దీంతో ఎలాగైనా సరే తెలంగాణలో ఉన్న 17 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకునే పనిలో పడింది.
ఇందుకు గాను ఆయా లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి కోఆర్డినేటర్లను నియమించింది ఏఐసీసీ. అభ్యర్థుల ఆర్థిక బలా బలాలతో పాటు సామాజిక నేపథ్యం, సర్వేల ఆధారంగా ఎంపిక చేయనున్నారు సమన్వయకర్తలు.
కోఆర్డినేటర్ల విషయానికి వస్తే ఆదిలాబాద్ ఎస్టీ నియోజకవర్గానికి గిరిజన శాఖ మంత్రి దాసరి సీతక్క, పెద్దపల్లి ఎస్సీ నియోజకవర్గానికి ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , నిజామాబాద్ ఎంపీ స్థానానికి కోఆర్డినేటర్ గా టి. జీవన్ రెడ్డిని నియమించింది.
జహీరాబాద్ లోక్ సభకు పి. సుదర్శన్ రెడ్డి, మెదక్ పార్లమెంట్ స్థానానికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహా, మల్కాజ్ గిరి స్థానానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, సికింద్రాబాద్ కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, చేవెళ్ల, మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గాలకు సీఎం రేవంత్ రెడ్డిని నియమించింది.
నాగర్ కర్నూల్ ఎస్సీ స్థానానికి కోఆర్డినేటర్ గా మంత్రి జూపల్లి కృష్ణారావు, నల్గొండ ఎంపీ స్థానానికి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వరంగల్ ఎస్సీ స్థానానికి కోఆర్డినేటర్ గా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మహబూబాబాద్ ఎస్టీ తో పాటు ఖమ్మం స్థానాలకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సమన్వయకర్తగా నియమించింది ఏఐసీసీ.