కాంగ్రెస్ గూటికి వైఎస్ సునీత
కడప జిల్లాలో సంచలనం
అమరావతి – ఏపీలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా కుదుపునకు లోనయ్యాయి. ఎవరూ ఊహించని రీతిలో ఇప్పుడు అన్నా చెల్లెలు మధ్య యుద్దం జరగనుంది. సీఎంగా ఉన్న జగన్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఎన్నికైన వైఎస్ షర్మిల ప్రచారం చేయనున్నారు. గతంలో కంటే ఈసారి రాజకీయాలు భిన్నంగా ఉండబోతున్నాయి.
తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి ఆ తర్వాత బరిలో ఉండకుండానే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. ఆ వెంటనే ఇక్కడ అధికారంలోకి రావడంతో తన ఫోకస్ ఏపీపై పెట్టింది. ఏఐసీసీ చీఫ్ , మాజీ చీఫ్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంది. ఆ వెంటనే ఆమెను ఏపీ పీసీసీ చీఫ్ గా నియమించింది హైకమాండ్.
ఈ తరుణంలో జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగలబోతోంది. కారణంగా తన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వైసీపీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి. ఇదే సమయంలో దివంగత ఎంపీ కూతురు డాక్టర్ సర్రెడ్డి సునీతా రెడ్డి షర్మిల సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు టాక్.
ఆమె కడప నుంచి ఎంపీగా లేదా పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.