కాంగ్రెస్ చెత్త రాజకీయం
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి
తిరుపతి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. దేవుడు వాళ్లకు తప్పకుండా గుణపాఠం చెప్పక తప్పదన్నారు. గతంలోనూ మా బాబాయ్‌ని మంత్రిని చేసి మాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిలబెట్టిందన్నారు.
చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోని కాంగ్రెస్.. ఈ సారి మా సోదరిని ప్రయోగించిందని ఆరోపించారు. తమ కుటుంబాన్ని విభజించి పాలించాలనే కుట్ర కాంగ్రెస్ చేస్తోందని ధ్వజమెత్తారు.
ఇది మంచి పద్దతి కాదన్నారు జగన్ మోహన్ రెడ్డి. దేశంలో ఎక్కడా లేని రీతిలో తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేశామని స్పష్టం చేశారు. తన సోదరి అమాయకురాలు అని, ఆమె కాంగ్రెస్ పార్టీ పెద్దల ఉచ్చులో పడిందని వాపోయారు.
తాను ప్రచారాన్ని కోరుకోనని , కేవలం పని చేయడాన్ని మాత్రమే తాను ఇష్ట పడతానని స్పష్టం చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. కోట్లాది మంది పేదలు, మధ్య తరగతి ప్రజానీకం బాగు పడ్డారని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే వారికి నిధులను మంజూరు చేయడం ఆపలేదని స్పష్టం చేశారు.