కాంగ్రెస్ సర్కార్ బక్వాస్ – కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
హైదరాబాద్ – రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలో ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ . ప్రగతి భవన్ లో మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాష్ట్ర గవర్నర్ ప్రసంగంలో అన్నీ అబద్దాలు పలికించారని ఆరోపించారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపారని అన్నారు. అందుకే తమ పార్టీ ఆధ్వర్యంలో శ్వేత పత్రం విడుదల చేశామని చెప్పారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదని లెక్క తీస్తే 420 హామీలు ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు .
దీనిని ఎండగట్టాల్సిన బాధ్యత బీఆర్ఎస్ శ్రేణులపై ఉందన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో రుణ మాఫీ చేస్తానని మాట ఇచ్చారని, కానీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మాత్రం రుణాలు చెల్లించాల్సిందేనంటూ ప్రకటించారని ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నించారు కేటీఆర్.
ప్రియాంక గాంధీ నిరుద్యోగ భృతి చెల్లిస్తామని అన్నారని కానీ భట్టి అనలేదంటూ అసెంబ్లీ సాక్షిగా అబద్దం చెప్పారని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తామని హామీ ఇచ్చారని అది కూడా ఇప్పట్లో నెర వేరేలా లేదన్నారు కేటీఆర్.