NATIONALNEWS

కూట‌మికి షాక్ నితీష్ జంప్

Share it with your family & friends

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్

బీహార్ – సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రుగుతున్న ఈ స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది. ప్ర‌తిప‌క్షాల‌తో కూడిన కూట‌మిని ఏర్పాటు చేయ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు బీహార్ సీఎం నితీశ్ కుమార్. అన్ని పార్టీల‌ను క‌లిశారు. అధినేత‌ల‌తో మాట్లాడారు. ఇండియా కూట‌మిని ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు.

ఇందులో టీఎంసీ చీఫ్ , సీఎం మ‌మతా బెన‌ర్జీ, ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ గుడ్ బై చెప్పారు. అంతే కాదు రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో న్యాయ్ యాత్రను ప‌శ్చిమ బెంగాల్ లోకి రాకుండా అడ్డుకున్నార‌ని ఆరోప‌ణ‌లున్నాయి. కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.

ఇదే స‌మ‌యంలో నిన్న‌టి దాకా బీజేపీని వ‌ద్ద‌ని అనుకున్న నితీశ్ కుమార్ ఉన్న‌ట్టుండి కూట‌మికి బై బై చెప్పారు. కాగా నితీశ్ కుమార్ సీఎంగా కొన‌సాగేలా , సుశీల్ మోడీ డిప్యూటీ సీఎం అయ్యే ఛాన్స్ ఉంద‌ని స‌మాచారం. ఇద్ద‌రు డిప్యూటీ సీఎంలు ఉంటార‌ని టాక్. జేడీయూ లోక్ స‌భ ఎన్నిక‌ల్లో 12 నుంచి 15 స్థానాల్లో పోటీ చేస్తుంది. అధికార ఒప్పందం కూడా ఖ‌రారైంది. బీజేపీకి చెందిన పాత ముఖాల‌న్నీ ప్ర‌భుత్వంలో భాగ‌మవుతార‌ని సీఎం ప్ర‌క‌టించారు.