కూలిన శివాజీ విగ్రహం మోడీ విచారం
భారత జాతికి క్షమాపణలు చెబుతున్నా
ఢిల్లీ – దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. శివాజీ మహారాజ్ విగ్రహం కూలి పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి. శుక్రవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇలా జరగడం తనను మరింత బాధకు గురి చేసిందని తెలిపారు.
క్షమాపణ చెప్పేందుకు తాను తల వంచుతున్నానని స్పష్టం చేశారు. “ఛత్రపతి శివాజీ మహారాజ్ కేవలం పేరు లేదా రాజు కాదు. కోట్లాది భారతీయులకు ఆయన ఆరాధ్య దైవం. ఈరోజు ఆయన పాదాలకు తలవంచి నమస్కరిస్తున్నానని తెలిపారు మోడీ. ఈ సందర్బంగా తనను మన్నించమని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు పీఎం.
“మా ఆరాధ్య దైవం కంటే పెద్దది ఏదీ లేదు. నేను ఇక్కడ దిగిన వెంటనే విగ్రహం కూలినందుకు ముందుగా ఛత్రపతి శివాజీ మహారాజ్‌కి క్షమాపణ చెప్పాను అని వెల్లడించారు మోడీ. కూలిపోవడం వల్ల గాయపడిన ప్రజలకు నేను క్షమాపణలు కూడా కోరుతున్నాను అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడారు.