కెప్టెన్ మిల్లర్ సూపర్
రూ. 50 కోట్ల క్లబ్ లోకి
తమిళ సినీ నటుడు ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ దుమ్ము రేపుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. తను సినిమా రిలీజ్ కంటే ముందు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు.
దర్శకుడి ప్రతిభకు తోడు ధనుష్ నటన హైలెట్ గా మారింది. దీంతో చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కథలో దమ్ముంటే కటౌట్ ఎందుకని ప్రశ్నించే ధనుష్ కు ఈ కొత్త ఏడాది కలిసి వచ్చిందనే చెప్పక తప్పదు.
తను రజనీకాంత్ కూతురుకు విడాకులు ఇచ్చాక వస్తున్న సినిమా కావడంతో ఒకింత ఉత్సుకుత పెరిగింది. ఇక సూపర్ స్టార్ నటించిన జైలర్ మూవీ రికార్డుల మోత మోగించింది. ఇక ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ జనవరి 12న విడుదలైంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.50 కోట్ల క్లబ్ లోకి అడుగు దూరంలో ఉంది.
దీంతో చిత్ర యూనిట్ తెగ సంతోషానికి లోనవుతున్నారు. టాలీవుడ్ లో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ చిత్రం పోటా పోటీగా విడుదలయ్యాయి. కానీ హనుమాన్ ముందు త్రివిక్రమ్ మూవీ తేలి పోయింది. బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. ఇక కెప్టెన్ మిల్లర్ కు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు.